YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో అయ్యా..ఎస్ లా....

ఏపీలో అయ్యా..ఎస్ లా....

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎన్నికలు ముగిసిన ఏపీలో రాజకీయ వేడి మాత్రం చల్లారడం లేదు. ఫలితాలు కోసం ఓ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తూనే... మరోవైపు అధికార,ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో సీఎస్ మార్పు మరో చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పుణేఠాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. అయితే ఎల్వీ నియామకంపై ఏపీ సీఎం చంద్రబాబు గరం గరం అయ్యారు. జగన్ కేసుల్లో నిందితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎలా సీఎస్‌గా నియమిస్తారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలతో కొంతమంది మాజీ ఐఏఎస్ అధికారులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వినతిపత్రం కూడా అందించారు. అయితే దీనిపై కూడా చంద్రబాబు మాట్లాడుతూ సీఎస్‌ను మార్చినప్పుడు,రాష్ట్రపతికి కొంతమంది ఐఏఎస్‌లు ఫిర్యాదు చేసినప్పుడు, ముగ్గురు ఎస్పీలను బదలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చినప్పుడు ఐఏఎస్ అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం IAS అధికారుల సంఘం సమావేశమైంది. విజయవాడ పున్నమి ఘాట్‌లోని అధికారులంతా భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు కొత్తగా వచ్చిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చేసిన వ్యాఖ్యలపై చర్చించాలనుకున్నారు. అయితే కోరం లేక ఈసమావేశం వాయిదా పడంది. IAS సంఘంలో 184మంది సభ్యులు ఉన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన భేటీకి14 మందే హాజరయ్యారు. కోరం ఉండాలంటే46 మంది హాజరు కావాలి. దీంతో ఏంచేసేది లేక సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు. చాలామంది అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో రాలేకపోయారని...అందుకే ఎలాంటి తీర్మానాలు చేయకుండా సమావేశాన్ని వాయిదా వేశామని చెప్పుకొచ్చారు.మరోవైపు ఎన్నికల తర్వాత చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏ సమీక్షలు సమావేశాలకు కూడా కొత్త సీఎస్ ఎల్వీ హాజరుకాలేదు. దీంతో సీఎం సీఎస్‌ల మధ్య సరైన సమన్వయం లేదని అందరికీ అర్థమైపోయింది. ఈ పరిస్థితుల్లోనే చంద్రబాబు ఆయనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Related Posts