Highlights
- సెట్ 3 ప్రశ్న పత్రాన్ని ఎంపిక..మంత్రి గంటా
- హోటల్ గేట్వే లో ఉదయం 6 గంటల కు
- 8 రకాల గ్రేడింగ్ లు
- ఏప్రిల్ 12 న ఫలితాలు
- మంత్రి గంట శ్రీనివాసరావు
రాష్ట్రంలో బుధవారం మొదలైన ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు సెట్ 3 ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంట శ్రీనివాసరావు తెలిపారు.బుధవారం ఉదయం అయన విజయవాడలోని హోటల్ గేట్వే లో మీడియాతో మాట్లాడారు. 9 గంటలనుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు. విద్యార్థులు అరగంట ముందే సెంటర్లకు చేరుకునేలా అధికారులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరా ఏర్పాటు చేసాం.. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఫిర్యాదుల కోసం విజయవాడలో టోల్ ఫ్రీ నెంబర్ 297413 ఏర్పాటు చేశామన్నారు.ప్రముఖ నగరాల్లో పరీక్ష కేంద్రాలను గుర్తించే విధంగా ఐపిఈ యాప్ ను అందుబాటులో ఉంచాం. విద్యార్థులు వినియోగించుకోవచ్చుని చెప్పారు. టేబుల్ పైన కూర్చుని మాత్రమే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాం.. ఎక్కడైనా కింద కూర్చుని రాసినట్టు మాకు తెలిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సెంటర్లలో లైటింగ్, డ్రింకింగ్, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. ఒత్తిడి లేకుండా ఉండేందుకు ర్యాంకులు కాకుండా గ్రేడింగ్ పద్దతిని తీసుకువచ్చాం. 8 రకాల గ్రేడింగ్ లు ఉంటాయి...ఏప్రిల్ 12 న ఇంటర్ పరీక్షల ఫలితాలు ప్రకటిస్తామన్నామని మంత్రి గంట తెలిపారు.