YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆత్మహత్యలు బాధకరం తెలంగాణ విద్యార్థులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ఏపి సిఎం చంద్రబాబు

 ఆత్మహత్యలు బాధకరం తెలంగాణ విద్యార్థులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ఏపి సిఎం చంద్రబాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణలో చోటు చేసుకున్న ఆత్మహత్యలపై పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు ట్వీట్లు ద్వార రియాక్ట్ ఐనారు. పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే - బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు - దేశానికి  మీరిచ్చే బహుమతి.+  మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు.+  పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి.+  విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు - పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవని పేర్కొన్నారు.కాని సొంతోళ్లు అంతమంది మరణిస్తే.. అయ్యో ఇలా జరిగిందేమిటి? అన్న ట్వీట్ కేసీఆర్ నుంచి రాకపోవటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related Posts