యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈవీఎంల విషయంలోఎన్నికల అధికారుల వద్ద సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో ఈవీఎం ల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలోఎన్నికల కమిషన్ సుమోటో గా చర్య తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నెహ్రు యువక కేంద్ర జాతీయ వైస్ చైర్మన్ ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈవీఎంల దొంగతనంచేసిన హరి ప్రసాద్ ను ప్రత్యేక విమానంలో వెంట పెట్టుకుని తిరుగుతుంది మీరేకదా అని ప్రశ్నించారు. ఇవి గతంలో కేఏ పాల్ చేసిన ఆరోపణలే చంద్రబాబు కూడా రష్యన్ హ్యాకర్ లు అంటున్నారు... పాల్ టీడీపీ కి సలహాదారా ?
తెలంగాణ లో ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతే నారాయణ, చైతన్య సంస్థల ప్రమేయం ఉన్నా అక్కడ మంత్రులుగా ఉన్నారని.. తెలంగాణ సర్కార్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. ఉగ్రవాదులకు మర్యాద ఇచ్చే తెలంగాణ సర్కార్..విద్యార్థులను మాత్రం బేడీలు వేసి తీసుకెళ్తున్నారు. రాయలసీమ టీడీపీ నాయకులు అక్కడి వనరులను దోచుకొని, సిగ్గు ఎగ్గూ లేకుండా అక్కడి ప్రజలను అవమానిస్తున్నారు. టీటీడీ బంగారం విషయం లో ఈవీ, జేఈవో ను ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు. 400 కోట్ల బంగారం అంత నిర్లక్ష్యం గా తరలిస్తే... తప్పు చేసిన వారు వివరణ ఇస్తే సరిపోతుందా... దీనిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ చెయ్యాలి. టీడీపీ జాతీయ పార్టీ కాదు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల లో ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్నాడు. జేసీ దివాకర్ రెడ్డి మాటలతో చంద్రబాబు వేల కోట్లు ఖర్చు చేశాడని తేట తెల్లం అయిందని అన్నారు. 5 సంవత్సరాలు, ఈవీఎం టీడీపీ టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని అయన విమర్శించారు.