యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆర్టీసీకి ఈ ఏడాది రూ.30కోట్ల లాభం వచ్చిందని సంస్థ ఎండీ సురేంద్ర బాబు వెల్లడించారు. ఐదు శాతం ఆక్యుపెన్సీ రేట్ పెరిగిందని తెలిపారు. ఆర్టీసీ రీజియన్ అధికారులతో ఎండీ సురేంద్ర బాబు సమీక్ష జరిపారు. ప్రతి కిలోమీటరుకు నష్టం వాటిళ్లుతోందన్నారు. రాష్ట్రంలో సుమారు వెయ్యి బస్సులు అవసరం ఉందని పేర్కొన్నారు. పీఆర్సీ పెంపుతో సంస్థపై రూ.750 కోట్ల అదనపు భారం పడిందన్నారు. అదేవిధంగా వెయ్యి కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.