YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దేవలయాలకు రక్షణ లేదు

దేవలయాలకు రక్షణ లేదు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు. గోవిందరాజస్వామి కిరిటాలు మాయమయ్యాయి. ఏ ఇంటిని సోదా చేస్తే కిరిటాలు దొరుకుతాయో పోలీసులకు తెలుసని వైకాపా జాతీయ కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టిటిడి అధికారులు ఎందుకు సరిగా మాట్లాడాటం లేదో అర్దం కావడంలేదు. బంగారం చెన్నై నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు హైవేపై రాకుండా వేపం పట్టు అనే లోపలరోడ్డునుంచి ఎందుకు రావాల్సి వచ్చిందో అర్దం కావడంలేదు. చిన్న విషయాలపై నిత్యం మాట్లాడే చంద్రబాబు టిటిడి బంగారం విషయంలో స్పందించలేదు.ఎందుకు సమీక్ష చేయలేదని అయన ప్రశ్నించారు.  ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగించారు.తర్వాత ముగ్గురు అర్చకులను తొలగించారు. యనమల  వియ్యంకుడుని టిటిడి బోర్డు ఛైర్మన్ గా నియమించడం జరిగింది.ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను ఈఓగా నియమించారు. ఇవన్నీ చూస్తే దొంగతనం, దొపిడీ చేయడానికి ప్రణాళిక బద్దంగా చేశారని అనిపిస్తుంది. ప్రభుత్వ సిఎస్ లుగా మొదట ఐవైఆర్  ,తర్వాత టక్కర్ ,అజయ్ కల్లాం తర్వాత పునేతాని నియమించారు. ఈసిఅధికారులు  జోక్యం చేసుకుని ఎల్వీని నియమించారు. ఐధుగురు సిఎస్ లు చంద్రబాబు వద్ద పనిచేస్తే చంద్రబాబు విధానాలను ముగ్గురు తీవ్రంగా వ్యతిరేకించారు. బంగారం అంశంపై సిఎస్ ఎల్వీ  విచారణాధికారిగా మన్మోహన్ సింగ్  నియమించారు.విచారణ నివేదికను పూర్తిగా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. గోవిందరాజుస్వామి ఆలయంలో కూడా కిరీటాలు మాయమయ్యాయి. జేబుదొంగలు ఇద్దర్ని పట్టుకుని వారే కిరీటాలు దొంగిలించారని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 
టిటిడి తవ్వకాల విషయానికి వస్తే గుప్తనిధులు బయటపడ్డాయి.ఆ తవ్వకాలలో ఎందుకు సీక్రెట్ మెయింటెన్ చేశారో చెప్పాలి. నేను విశాఖలో తవ్వకాల అంశంపై పలు డిమాండ్స్ చేశాను.దానిపై నా మీద పరువునష్టం దావా వేశారు. 40 దేవాలయాలను విజయవాడలో కూలగొట్టారు.తిరిగి కట్టిస్తామని చెప్పి ఇంతవరకు పునర్మించింది లేదు.కట్టింది లేదు.మసీదులను సైతం కూలగొట్టారు.చంద్రబాబు కట్టిస్తామని ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కృష్ణా,గోదావలి పుష్కరాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అన్నారు. దేవుడి సొమ్ము అంటే చంద్రబాబుకు లెక్కలేని తనం.  మీ మనవడికి మీరు దేవాన్ష్ అని పేరు పెట్టుకున్నారు. దేవాన్ష్ అంటే దేవుని అంశ అనేది మంచిపేరు.మీరు ప్రజలకు చేస్తున్న అన్యాయాలను అక్రమార్జన దోపిడీలను చూస్తే మీ మనవడు అన్ని నిశితంగాచూస్తున్నాడు. మీకుమారుడికి అన్ని దొంగ బుద్దులు నేర్పించాడు.దేవాన్ష్ ఎప్పుడో ఒకప్పుడు అతను ఇలా రాష్ట్ర ప్రజలను దోపిడీ చేశావు అని ప్రశ్నిస్తే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు అని ప్రశ్నిస్తున్నానని అన్నారు. 

Related Posts