YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మజిలీ తర్వాత భారీ రేట్ పెంచేసిన సమ్మూ

మజిలీ తర్వాత భారీ రేట్ పెంచేసిన సమ్మూ
యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:
దక్షిణాది సినిమాలోని స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమె క్యూట్ లుక్స్‌కి పడిపోని కుర్రాళ్లు ఉండరు. ఆమె నటనను మెచ్చుకోని ప్రేక్షకుడు ఉండడు. సమంత ఎంత బాగా నటించినా ఇంతకాలం హీరోల చాటు హీరోయిన్‌గానే మిగిలిపోయింది. అనుష్క, నయనతార మాదిరిగా ఒక సినిమాను ఒంటి చేత్తో నిలబెట్టే క్రేజ్ సంపాదించలేకపోయింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అక్కినేని వారి కోడలిగా మారిన తరవాత సమంత క్రేజ్ మరింత పెరిగింది. నాగచైతన్యను పెళ్లాడిన తరవాత స్టార్ హీరోలెవ్వరూ సమంతను హీరోయిన్‌గా పెట్టుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో తానే సోలోగా తన టాలెంట్‌ను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తోంది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తోంది. ‘యూటర్న్’ సినిమాతో సోలోగా ప్రయత్నించింది. ‘మజిలీ’ సినిమాతో తన సత్తాను చాటుకుంది. తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అసలు ఆ పాత్రలో సమంత కాకుండా వేరే వాళ్లు చేస్తే చూడలేకపోయేవారమని అనేవాళ్లు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే సమంత వల్లే ఈ సినిమాకు అంత క్రేజ్ ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ఆమె ఒంటి చేత్తో ఈ సినిమాను నిలబెట్టేసింది. ఈ సంగతి సమంతకు కూడా తెలుసు. అందుకేనేమో ‘మజిలీ’ తరవాత పారితోషికం పెంచాలని సమంత నిర్ణయించుకుంది. ఇకపై పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు చాలా తక్కువ గనుక, చిన్న సినిమాల్లో నటించి పారితోషికం ఎక్కువ తీసుకోవాలని సమంత డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పారితోషికం కింద బాదాలని సమంత చూస్తోందట. ఇప్పటికే తనను సంప్రదించిన నిర్మాతలకి అదే మొత్తం చెప్పిందని టాక్. నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను సంప్రదించారట. అయితే, ఆమె అడిగిన పారితోషికానికి జడిసి దిల్ రాజు వద్దనుకున్నారని సమాచారం. మొత్తానికి అక్కినేని వారి కోడలు తన పారితోషికం పెంచేసి నిర్మాతలకు షాక్ ఇస్తోందన్న మాట!

Related Posts