తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, నటుడు నందమూరి తారక రామారావు జీవితం వివాదాస్పదంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తర్వాత లక్ష్మీ పార్వతి - ఎన్టీఆర్ బంధం, వెన్నుపోటు, ఎన్టీఆర్ మరణం వంటి అంశాలు చర్చనీయంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు ఒకప్పుడు డ్రైవర్‌గా వ్యవహరించిన లక్ష్మణ్ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోయినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు. బాబు పాలన ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పమన్నారు. నాకేం తెలుస్తుంది సార్ అని నేను అన్నాను. ఇందుకు ఆయన.. ‘నువ్వు బయటకు వెళ్తావు కదా లచ్చన్నా.. నీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? చెప్పు’ అన్నారు. ఇందుకు నేను.. ఆయన పాలనకేమండి, రాజకీయ చాణుక్యుడు. మంచిగానే చెప్పుకుంటున్నారని తెలిపాను. మనది కూడా తప్పున్నది కదా సార్ అన్నాను. అందుకు ఆయన నా వంక అలా చూశారు. రావణుడు సీతను లంకలో పెట్టుకుని సర్వ నాశనం అయ్యాడు. అట్లా మీరు ఈమె(లక్ష్మీపార్వతి)ను ఇంట్లో పెట్టుకుని పేరు పోగొట్టుకున్నారు అన్నాను. ఆ మాటలకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘అనండి లచ్చన్న, అందరూ అన్నారు. మీరు ఒక్కరే అనలేదు’ అని బాధపడ్డారు. అయితే, నేను ఆయనకు అధికారం, వ్యక్తిగత ప్రతిష్ట పోయిందనే బాధతోనే ఆ మాటలు అన్నాను’’ అని లక్ష్మణ్ అన్నారు. ‘‘లక్ష్మీ పార్వతి ఉన్నంత కాలం ఆయన పిల్లలు ఇంటికి వచ్చేవారు కాదు. లక్ష్మీ పార్వతి అంటే ఇష్టం లేక కాదు. ‘ఆమెను ఇంట్లో పెట్టుకుంటే పెట్టుకున్నావు. కానీ ఆమెను మా అమ్మలా ఉండమను’ అని పిల్లలు అనేవారు. అయితే, అప్పటికి పెద్ద గొడవలు జరగలేదు. బసవతారం అమ్మగారి బంగారు నగలు అబిడ్స్‌లో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఉన్న ఇంట్లో ఉండేవి. ఒక రోజు సారు రామకృష్ణ ఇంటికి తీసుకెళ్లమన్నారు. ఆ రోజు రామకృష్ణ ఇంట్లో లేరు, బెంగళూరు వెళ్లారు. అయితే, సారు మూడో అంతస్థుకు వెళ్లి.. తాళాలు తీసే వ్యక్తిని తీసుకురమ్మని చెప్పారు. నేను అతన్ని తీసుకొచ్చాను. కొద్ది సేపటి తర్వాత సారు కండువ నిండా బంగారాన్ని కట్టుకుని కిందికి దిగారు. కారులో వెనుక సీటులో కూర్చొని బయల్దేరమన్నారు’’. ‘‘రామకృష్ణ బాబు ఊరి నుంచి రాగానే కోపంతో ఊగిపోయారు. ఆయన్ను నువ్వేనా ఇంటికి తీసుకొచ్చింది అంటూ రఫ్ మాట్లాడారు. నేను గవర్నమెంట్ మనిషిని, సార్ ఏ పని చెబితే ఆ పని చేయాలి అని చెప్పాను. ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీ వాలిపోయారు. వచ్చి గొడవ పడ్డారు. మా అమ్మ సొమ్ములు ఆమెకు ఇవ్వద్దని అన్నారు. సార్‌ను ఒక మాట కూడా అనలేదు. లక్ష్మీ పార్వతితోనే గొడవ పడ్డారు. అప్పుడే మద్రాసు నుంచి వచ్చిన లోకమ్మ ఈ గొడవలో రఫారఫ్ లక్ష్మీపార్వతి కొట్టేసింది. ఆ సమయంలో సార్‌ను పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు ఏమీ అనలేదు. వారికి అంత ధైర్యం లేదు’’ అని లక్ష్మణ్ తెలిపారు.‘‘లక్ష్మీ పార్వతి, ఆమె భర్త వీరగంధం సుబ్బరావు టీవీలో ఛాన్స్ ఇప్పించండి. హరికథలు చెబతాం అని ఎన్టీఆర్‌ను కోరారు. దీంతో సారు దూరదర్శన్ అవకాశం ఇచ్చారు. ఆమెకు కొడుకు ఉన్నాడు, భర్త ఉన్నాడు.. అలాంటిది ఆమె ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకుందంటే జనం నమ్ముతారా? ఆమె గురించి మాట్లాడటం వేస్ట్. ఆడదాని మాయ దేవుడు కూడా గుర్తు పట్టలేదు. సేవ చేస్తున్నా అంటూ వచ్చింది. ఆయనకు సేవ చేయడానికి ఎవరూ లేరా? పిల్లలు ఆయనకు మొదటి నుంచి దూరంగా ఉండేవారు. డబ్బు అవసరం ఉంటేనే వచ్చేవారు. ఈమె వచ్చాక పూర్తిగా రావడం మానేశారు’’ అని అన్నారు. లక్ష్మణ్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.