YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

గ్రీన్ ఎకర్స్ నుంచి సెలబ్రేషన్ క్లబ్ కు భౌతికకాయం

Highlights

  • పోటెత్తుతున్న అభిమానుటు
  • సెటబ్రేషన్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు
గ్రీన్ ఎకర్స్ నుంచి సెలబ్రేషన్ క్లబ్ కు భౌతికకాయం

శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబై లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఎకర్స్ లో ఉన్న నివాసం నుంచి సెలబ్రేషన్ క్లబ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అక్క ఆమె అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన కథానాయికను చివరిసారి చూడాలనే తపనతో వేలాది మంది అక్కడకు తరలివచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమె భౌతికకాయాన్ని సందర్శించుకోవడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత 2 గంటలకు అక్కడి నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్యలో ఆమె అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు. మరోవైపు శ్రీదేవిని కడసారి చూసేందుకోసం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్ క్లబ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Related Posts