YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఫోన్ల ట్యాపింగ్ ఫై అఫిడవిట్ దాఖలు చేయండి ఏపి ప్రభుత్వానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

 ఫోన్ల ట్యాపింగ్ ఫై అఫిడవిట్ దాఖలు చేయండి                ఏపి ప్రభుత్వానికి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను అధికారులు ట్యాపింగ్ చేశారంటూ దాఖలైన కేసుపై హైకోర్టు గురువారం  విచారించింది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. జస్టిస్ ఏవీ శేషసాయి.. జస్టిస్ యు. దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాల్ని జారీ చేసింది.టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2)ను అనుసరించాలా?  లేదా అంశాలపై రాతపూర్వకంగా  స్పష్టత ఇవ్వాలని కోరింది. ఈ కేసు విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. తనతో పాటు తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లను ఏపీ అధికారులు అన్యాయంగా ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీన్ని విచారణకు చేపట్టిన న్యాయస్థానం.. తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని అఫిడవిట్ ను కోర్టుకు ఇవ్వాలని కోరింది. ట్యాపింగ్ వ్యవహారంలో టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) ను అనుసరించినట్లుగా పేర్కొన్న అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలు వినిపిస్తూ రూల్స్ ను ఫాలో అయ్యామని పేర్కొన్నారు.ఏజీనే స్వయంగా ఫోన్లను రూల్స్ ప్రకారం ట్యాప్ చేసిన విషయాన్ని ఒప్పుకుంటున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేయనున్న అఫిడవిట్ లో ఏయే అంశాలు ఉంటాయన్నది ఉత్కంటగా మారనుంది.

Related Posts