యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
శ్రుతి హాసన్, లండన్ థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్ విడిపోయారు. గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న ఇద్దరూ ఇప్పుడు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన మైఖేల్, జీవితం తామిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచిందని అనడం గమనార్హం. తామిద్దరమూ ఇక ఒంటరి మార్గాల్లో నడవాల్సి రావడం దురదృష్టకరమని, శ్రుతి ఎప్పటికీ తన బెస్ట్ ఫ్రెండేనని అన్నాడు. శ్రుతితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్న మైఖేల్, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు.