YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లండన్ కోర్టులో నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు

లండన్ కోర్టులో నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక నిందితుడు నీరవ్ మోదీకి లండన్ కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ దాఖలు చేసిన మూడో పిటిషన్‌నూ న్యాయస్థానం తిరస్కరించింది. తదుపరి విచారణను మే 24 కు వాయిదా వేసింది. మార్చి 19న నీరవ్ మోదీని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా.. నీరవ్ దేశం విడిచి పోయే అవకాశం ఉందని, సాక్ష్యాలు తారుమారు చేస్తాడని.. బెయిల్ ఇవ్వొద్దని భారత్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే తాను దేశం విడిచిపోనని.. భారత్‌లో కేసు నమోదు కాకముందు నుంచి తాను ఇక్కడ ఉంటున్నానని.. అలాంటిది తాను దేశం విడిచిపోతాననే కారణంతో బెయిల్ ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. బెయిల్ తిరస్కరిస్తూ.. విచారణను వచ్చే నెల 24కు వాయిదా వేసింది.

Related Posts