YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అంపైర్ కన్ఫ్యూజన్...

 అంపైర్ కన్ఫ్యూజన్...

 యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నోబాల్ విషయంలో ఏమరపాటు కారణంగా రెండు మూడు మ్యాచ్‌ల ఫలితాల్ని ఆఖర్లో మార్చేసిన అంపైర్లు.. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌లోనూ తడబడ్డారు. ఎంతలా అంటే..? బ్యాట్స్‌మెన్ హిట్ వికెట్‌గా ఔటైనా.. గమనించకుండా ఫోర్‌ సిగ్నల్ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ డెడ్‌బాల్‌గా ప్రకటించి.. ఆఖర్లో ఔట్‌ ఇచ్చేంతలా..! అసలు ఏం జరిగిందంటే..? ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి మ్యాచ్ జరగగా.. ఆ మ్యాచ్‌లో 176 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు విజయానికి చివరి 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన ఆండ్రీ రసెల్ ఓవర్‌లో.. నాలుగో బంతిని 17 ఏళ్ల యువ హిట్టర్ రియాన్ పరాగ్ (47: 31 బంతుల్లో 5x4, 2x6) కళ్లు చెదిరే‌రీతిలో సిక్స్‌గా మలిచాడు. దీంతో.. తర్వాత బంతిని రసెల్‌ షార్ట్ పిచ్‌ రూపంలో సంధించగా.. పరాగ్.. ఫైన్‌లెగ్ దిశగా ఫుల్ చేశాడు. బంతిని అయితే.. అతను కనెక్ట్ చేయగలిగాడు. కానీ.. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి వికెట్లను బ్యాట్‌తో తాకించేశాడు. మరోవైపు అతను కొట్టిన బంతి నేరుగా బౌండరీకి వెళ్లిపోయింది. 
పరాగ్ హిట్ వికెట్‌గా ఔటైనా.. అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఏమరపాటులో చూసుకోకుండా.. బంతి బౌండరీకి వెళ్లడంతో తొలుత ఫోర్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ తర్వాత బెయిల్స్ పడి ఉండటాన్ని చూసి.. బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తూ నిర్ణయం మార్చాడు. కానీ.. హిట్ వికెట్‌గా ఔటయ్యానంటూ పరాగ్ పెవిలియన్‌కి వెళ్లిపోతుండటంతో.. అప్పుడు తీరిగ్గా అంతిమ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కి నివేదించాడు. మొత్తంగా.. నిమిషం వ్యవధిలోనే.. అంపైర్ తికమక నిర్ణయాలతో సతమతమయ్యాడు..! 

Related Posts