YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మరో వివాదంలో టీటీడీ

మరో వివాదంలో టీటీడీ
అర్చకులకు పదవీ విరమణ నిబంధనలను అమలు చేసిన టీటీడీ సిబ్బంది తొలగింపు అంశంపై పలు విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన పూజారి రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరో వివాదస్పద నిర్ణయం తీసుకున్నారు. పరకామణిలో పనిచేస్తున్న 40 మంది మజ్దూర్లను తొలగించడంతో స్వామి వారి ఆదాయ లెక్కింపు మినహా మిగతా పనులు నిలిచిపోయాయి. టీటీడీ ఆర్థిక అధికారి తీసుకున్న నిర్ణయంతో పరకామణిలో సేవలకు అంతరాయం ఏర్పడింది. తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా రోజూ రెండు నుంచి మూడు కోట్ల కానుకలు సమకూరుతాయి. ఇందులో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉంటాయి. వీటిని ఏ రోజుకారోజు వేరుచేసి వివరాలు నమోదు చేసి టీటీడీ ట్రెజరీలో జమ చేస్తుంటారు. అయితే మజ్దూర్ల తొలగింపుతో కేవలం నోట్ల లెక్కింపు తప్ప మిగిలి రూపాల్లోని ఆదాయాన్ని లెక్కించడం లేదు. దీనివల్ల బంగారం, ఇతర వస్తువులు పేరుకు పోతున్నాయని, తక్షణం టీటీడీ అధికారులు తమకు సిబ్బందిని కేటాయించాలని పరకామణి నిర్వాహకులు కోరుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి అప్రైజర్‌ లేకుండా పరకామణి కొనసాగుతుండగా, ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా మజ్దూర్ల తొలిగించడం మరో వివాదానికి దారితీసే ఆస్కారం ఉంది. పరకామణి ఆర్థిక వ్యవస్థను టీటీడీ ఆర్థికశాఖ అధికారి నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో మాదిరిగానే సిబ్బందిని కేటాయించాలంటున్న పరకామణి అధికారులు కోరుతున్నారు. ఇటీవల శ్రీవారి బంగారం తరలింపు అంశం కూడా వివాదాస్పదమైంది. టీటీడీకి చెందిన 1381 కిలోల బంగారం పంజాబ్ నేషల్ బాంక్ నుంచి సరైన పత్రాలు, రక్షణ లేకుండా తరలిస్తుండగా సీజ్ చేశారు. అనేక మలుపులు అనంతరం ఇది టీటీడీకి చేరింది. రూ. 400 కోట్ల విలువైన బంగారం వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమించిన మన్మోహన్ సింగ్ కమిటీ నివేదిక సమర్పించింది. అంత పెద్ద మొత్త తరలింపులో అటు బాంక్ ఇటు టీటీడీ అధికారుల నిర్ల్యక్ష్యం ఉందని అందులో స్పష్టం చేశారు. 

Related Posts