YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహుల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

రాహుల్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రాహుల్ సురక్షితంగా తిరిగి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం  రాహుల్ గాంధీ.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయల్దేరారు. మార్గం మధ్యలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే పైలట్లు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులకు సమస్యను వివరించిన అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిన విషయాన్ని రాహుల్‌ గాంధీ తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆయన ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. ఈ కారణంగా తాను పాల్గొనాల్సిన బహిరంగ సభ ఆలస్యంగా ప్రారంభం అవుతోందని.. అసౌకర్యానికి క్షమించాలని కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ సందేశం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ.. శుక్రవారం బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగనున్న సభల్లో రాహుల్‌ పాల్గొనాల్సి ఉంది. విమానంలో అకస్మాత్తుగా సమస్య తలెత్తడంపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో పైలట్లతో పాటు మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ రాహుల్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు డిమాండ్‌ చేశారు. దాంట్లో ఏదో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించడం అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. 

Related Posts