YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వారణాసి నుంచి మోడీ నామినేషన్

వారణాసి నుంచి మోడీ నామినేషన్
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న మోదీ.. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసే కంటే ముందు.. అక్కడి కాలభైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మోదీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని మోదీ స్పష్టం చేశారు. మళ్లీ మోదీ సర్కార్‌ను గెలిపించాలన్న గట్టి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారని మోదీ తెలిపారు. వారణాసి లోక్ సభ నియోజకవర్గంలో మోదీపై కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. ఎస్పీ - బీఎస్పీ కూటమి నుంచి షాలినీ యాదవ్‌ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గానికి మే 19న ఎన్నికలు జరగనున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసి నుంచి గెలుపొందిన మోదీకి 5,81,022 ఓట్లు రాగా, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు 2,09,238 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ కు 75,614 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు వడోదర(గుజరాత్‌) నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే వడోదర నుంచి తప్పుకున్న మోదీ.. వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్ల తేడాతో నరేంద్ర మోదీ విజయం సాధించారు. వడోదర స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూద మిస్గ్రీ మీద భారీ మెజార్టీతో గెలుపొందారు మోదీ.
మోడీని నామినేట్ చేసిన కాటి కాపరి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి మరోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో వారణాసి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన ఆయన రెండో పర్యాయం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు నామినేషన్ దాఖలు చేశారు. కాగా, మోదీని ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదించినవారిలో ఓ కాటికాపరి కుటుంబ సభ్యుడు కూడా ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. వారణాసిలోని ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్ వద్ద దహనసంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన వ్యక్తికి ప్రధాని తనను ప్రతిపాదించే అవకాశాన్ని కల్పించారు.అంతేగాకుండా, ఆయన పేరును ప్రతిపాదించినవారిలో ఓ వాచ్ మన్, ఓ స్కూలు ప్రధానోపాధ్యాయురాలు, బీజేపీ సీనియర్ నేత కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మోదీ స్థానిక కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నపూర్ణ శుక్లా వంటి పెద్దవాళ్లకు మోదీ సనాతన ధర్మం ప్రకారం పాదాభివందనం చేసి నామినేషన్ దాఖలుకు బయల్దేరారు.
ఒక‌వేళ తానేమైనా త‌ప్పు చేస్తే, ఆదాయం ప‌న్ను శాఖ అధికారులు నా ఇంట్లోనూ దాడులు చేయాల‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు చేస్తున్న దాడుల‌పై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేస్తున్నాయ‌న్నారు. రాజ‌కీయ క‌క్ష‌తో నేత‌ల ఇండ్ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం లేద‌ని, చ‌ట్టం ప్ర‌కార‌మే ఆ సోదాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ఇవాళ ఉద‌యం వార‌ణాసిలో నామినేష‌న్ వేసిన త‌ర్వాత ఆయ‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సిద్ధిలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. క‌రెంటు బిల్లుల‌ను త‌గ్గిస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. చివ‌ర‌కు క‌రెంటు స‌ర‌ఫ‌రానే త‌గ్గించింద‌ని విమ‌ర్శించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త ప్ర‌భుత్వం క‌న్నా కాంగ్రెస్ పార్టీ త‌క్కువ విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తోంద‌న్నారు

Related Posts