యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
చెపాక్‌లో చెన్నై జోరుకు ముంబై తెరదించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి 46 పరుగుల తేడాతో ధోని లేని చెన్నైపై ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై రోహిత్ శర్మ (67; 48 బంతుల్లో 6×4, 3×6) రాణించడంతో మొదట ముంబయి 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. శాంట్నర్ (2/13) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఛేదనలో చెన్నై తేలిపోయింది. మలింగ (4/37), కృనాల్ పాండ్య (2/7), బుమ్రా (2/10) ధాటికి 17.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. మురళీ విజయ్ (38; 35 బంతుల్లో 3×4, 1×6) టాప్ స్కోరర్. చెన్నై ఇంతకుముందే ప్లేఆఫ్స్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.