YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తీవ్ర వాయుగుండంగా ఫణి

 తీవ్ర వాయుగుండంగా ఫణి
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర వాయుగుండంగా మారి సాయంత్రానికి తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం నాటికి ఇది ఇది తీవ్ర తుపానుగా మారబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఏప్రిల్ 30 వరకు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తున్నా ఆ తర్వాత తన దిశను మార్చుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే బుధవారం నుంచి ఆదివారం వరకు కోస్తాంధ్ర తీరం వెంబడి పయనించే అవకాశాలున్నాయని అంటున్నారు. కానీ, తీవ్ర తుఫానుగా మారిన తర్వాత ఏపీ, ఒడిశా తీరం వెంబడి ప్రయాణించి పశ్చిమబెంగాల్‌ వైపునకు గానీ, ఈశాన్యం వైపునకు గానీ దిశ మార్చుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. అయితే, తీరానికి దగ్గరగా వెళ్తుందా, దూరంగా వెళ్తుందా అనేది తీవ్ర తుఫానుగా మారేలోపు స్పష్టత వస్తుందని, తమిళనాడు, ఏపీలో తీరం దాటే అవకాశాలు ఉండకపోవచ్చని వివరించారు. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం బంగాళాఖాతంలోని వాయుగుండం మచిలీపట్నానికి 1620 కి.మీ దూరంలోనూ, శ్రీలంకలోని ట్రికోమలీకి 940 కి.మీ దూరంలో, చెన్నైకి 1340 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి, సాయంత్రం 5.30 గంటలకు తుఫానుగా మారనుంది. ఏప్రిల్ 29 తెల్లవారుజామున ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని బులిటెన్‌లో వివరించారు. ప్రస్తుతం ఇది 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దీని ప్రభావంతో ఏప్రిల్ 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 29న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. దీని తీవ్రత 30వ తేదీ వరకు ఉంటుదని, ఈ విషయంలో స్పష్టత వచ్చిందని అన్నారు. శనివారం నుంచే పెనుగాలులు వీస్తాయని, తీరం దాటే సమయానికి ఇవి గంటకు 135 కి.మీ వేగానికి చేరి తీరాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి పేరు బంగ్లాదేశ్ సూచించినట్టుగా తుఫానుగా ఏర్పడిన వెంటనే ‘ఫణి’గా నామకరణం చేయనున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో శనివారం నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని ఆర్టీజీఎస్‌ సూచించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారంతా ఆదివారంలోగా తీరానికి తిరిగి వచ్చేయాలని తెలిపింది. వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని హెచ్చరించింది. ప్రజలు కూడా తీర ప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

Related Posts