యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తనది మరీ వెనుకబడిన కులం కాని నేను వెనుకబడిన వ్యక్తిని కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం యూపీలోని కన్నౌజ్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాయావతి, అఖిలేశ్ కూటమి చేసిన వ్యాఖ్యలను మోదీ తప్పుపట్టారు. మోదీది ఫేక్ ఓబీసీ సర్టిఫికెట్ అని ఎస్పీ, బీఎస్పీ నేతలు ఆరోపించారు. దానికి ఇవాళ మోదీ కౌంటర్ ఇచ్చారు. నేనెప్పుడూ నా కులం గురించి మాట్లాడలేదని, కానీ మహాకూటమి నేతలు మాత్రం కులం గురించి మాట్లాడే విధంగా రెచ్చగొడుతున్నారని నేను వెనుకబడిన వ్యక్తిని కాను కానీ కటిక వెనుకబడిన కుటుంబంలో పుట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కులరాజకీయాల్లోకి తనను లాగవద్దన్నారు. తాను కేవలం ఓబీసీని మాత్రమే కాదు అని కానీ మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్‌లో పుట్టినట్లు చెప్పారు. మీరే కులద్రువీకరణ పత్రాలు సరఫరా చేస్తున్నారని కానీ తానెప్పుడు ఇలాంటి ఆట ఆడలేదన్నారు. జాతీయ పతాకాన్ని ప్రేరణగా తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు మోదీ చెప్పారు. జాతీయ జెండాలో ఉండే మొదటి రంగు తరహాలో.. కాషాయం రంగును విప్లవాత్మకంగా మార్చాలనుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు.