YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టిటిడి ఎస్వీ పూర్ హోం లోని రోగులకు, వృద్ధులకు మరింత మెరుగైన సౌకర్యాలు

  టిటిడి ఎస్వీ పూర్ హోం లోని     రోగులకు, వృద్ధులకు మరింత మెరుగైన సౌకర్యాలు

టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ పూర్ హోమ్లోని లెప్రసీ ఆసుపత్రిలోని రోగులకు, కరుణాధామంలోని వృద్ధులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టిటిడి తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పూర్ హోమ్ను శనివారం ఉదయం జెఈవో అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎస్వీ పూర్ హోమ్లోని రోగులకు, వృద్ధులకు తాగునీరు, నాణ్యమైన అన్నప్రసాదాలు, రాజీలేకుండా పారిశుద్ధ్యం ఏర్పాటు చేయాలన్నారు.  లెప్రసీ ఆసుపత్రిలోని రోగుల సౌకర్యార్థం  బ్యాటరీ వాహనం ఏర్పాటు చేయాలని ట్రాన్స్పోర్టు అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు ఆసుపత్రికి వచ్చే రోగులకు, ఇన్పేషంట్లకు డ్రస్సింగ్ చేసే గదిలో ఇన్ప్క్షన్ కలుగకుండా ఎసి ఏర్పాటు చేయాలన్నారు. లెప్రొసి ఆసుపత్రి నుండి కరుణాధామంకు వెళ్ళే మార్గంలో రోడ్డుకు మరమ్మత్తులు చేయాలన్నారు. ఎస్వీ డైరీ ఫాం, గార్డెన్ విభాగం, టిటిడి అటవీ విభాగం వారు పూర్ హోమ్లో పచ్చదనం పెంపొందించేంకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి, కరుణాధామంలో జరుగుతున్న సివిల్, ఎలక్ట్రికల్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. పూర్ హోమ్లో రోగులకు, వృద్ధులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలను జెఈవో అడిగి తెలుసుకున్నారు. వారు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.    అంతకుముందు జెఈవో లెప్రసీ ఆసుపత్రిలోని రోగులకు మందుల పంపిణీ, రోగుల వార్డులు, అన్నప్రసాదాల పంపిణీని పరిశీలించారు. అనంతరం రోగులకు, వృద్ధులకు జెఈవో పండ్లు పంపిణీ చేశారు.  

Related Posts