YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శ్రీలంక చట్టంలో ముసుగులు...

 శ్రీలంక చట్టంలో ముసుగులు...

ఈస్టర్ సండే రోజు కొలంబోలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 250 మందికిపైగా బలయ్యారు. దాదాపు 500 మంది గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందారు. వరుస బాంబు పేలుడు ఘటనలు లంకను వణికించాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. నిఘా వర్గాల సమాచారం ఉన్నా బాంబు పేలుళ్లను ఆపలేకపోయామన్న లంక ప్రభుత్వం క్షమించాలని మృతుల కుటుంబాలను వేడుకుంది. దీన్ని బట్టి బాంబు పేలుళ్లు స్వయంకృతాపరాధం అని తెలుస్తోంది. మరో దారుణం ఏంటంటే.. తమ దేశీయులే ఉగ్రవాదులని తెలిసినా వారిని ప్రభుత్వం అడ్డుకోలేక పోయింది. తమ దేశానికి చెందిన కొందరు సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరి వెనక్కి తిరిగొచ్చారని తమకు తెలుసని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే తెలిపారు. కానీ వారిని అరెస్ట్ చేయలేకపోయామన్నారు. లంక చట్టాల ప్రకారం విదేశీ ఉగ్రవాద సంస్థలో చేరడం నేరం కాదు. లంక భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకోగలదు. చట్టంలోని ఈ లొసుగు వల్లే ఉగ్రవాదులు తమ కళ్ల ముందే తిరుగుతున్నా లంక ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఫలితంగా కొలంబో నెత్తురోడింది. వరుస పేలుళ్లతో అప్రమత్తమైన లంక ప్రధాని కాలం చెల్లిన పాత చట్టం స్థానంలో కొత్త చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు సరిపోవన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరడటానికి ఉగ్రవాదంలో చేరిన వారిని అరెస్ట్ చేయడమే కాదు.. వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేలా చట్టాలను తేవాల్సి ఉందన్నారు. శ్రీలంకలో పేలుళ్లు జరగడానికి అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడా కారణమే. లంకలో దాడులు జరిగే అవకాశం ఉందని భారత్, అమెరికా నిఘా సంస్థలు ముందే శ్రీలంక నిఘా విభాగాన్ని హెచ్చరించాయి. కానీ ఈ సమాచారం తనకు తెలియదని ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు.

సేఫ్ గా తప్పించుకున్న అనిల్ కుంబ్లే 

ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన వరుస పేలుళ్లలో 253 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 500 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. మరోవైపు, ఈ దాడుల నుంచి భారత్ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సురక్షితంగా బయటపడ్డాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి వేసవి సెలవులను ఎంజాయ్ చేసేందుకు కుంబ్లే శ్రీలంక వెళ్లాడు. బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న కొలంబోలోని షాంగ్రి లా హోటల్ లోనే వీరు బసచేశారు. పేలుళ్లు జరిగిన శుక్రవారం ఉదయం వారు అల్పాహారం తీసుకున్నారు. పేలుడు జరడానికి గంటల ముందు వారు హోటల్ నుంచి బయటకు వచ్చారు. యాలా నేషనల్ పార్క్ లో వారు ఉండగా... హోటల్ లో బాంబు పేలుడు జరిగినట్టు కుంబ్లేకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనను వారు అర్ధాంతరంగా ముగించుకుని, మంగళవారం నాడు బెంగళూరు చేరుకున్నారు.అనిల్ కుంబ్లే కుటుంబం అల్పాహారం తీసుకున్న ప్రాంతంలోనే సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు

Related Posts