యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారని, అందులో ఆయన ఎస్పీ రంజిత్ కుమార్ రాణాగా కనిపిస్తారని తాజా సమాచారం..
మరో వైపు తన బరువును కనీసం 20 కిలోలను తగ్గించుకోవాలని హీరో నందమూరి బాలకృష్ణ నిర్ణయించుకున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు. బాలకృష్ణకు 'సింహా', 'లెజండ్' వంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి, బాలయ్యతో తదుపరి కమిట్ అయిన సినిమా కోసం బరువు తగ్గక తప్పదట. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేసి, బరువు తగ్గుతానని అన్నారట.