యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. సీఈవోతో ఆయన ఏం చర్చించారన్న విషయాలేవీ బయటకు రాలేదు. పార్టీ నేత తలసిల రఘురామ్ తో కలిసి సచివాలయంలోని ద్వివేది కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డి, రఘురామ్ ను లోనికి తీసుకెళ్లలేదని తెలుస్తోంది. ఆపై గంట తరువాత బయటకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.