Highlights
- కొన్ని పరిణామాలంతే..
- విజయరామారావు గొప్ప నాయకుడేం కాదు
- పీజేఆర్ పై గెలిచారని మంత్రి పదవి ఇచ్చాం
- చంద్రబాబునాయుడు
జీవితంలో జరిగే కొన్ని తప్పులను సరిదిద్దుకోలేమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొన్ని సందార్భాల్లో వేసే అంచనాలు తారుమారవుతుంటాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు విషయంలో కూడా అదే జరిగిందన్నారు. కేసీఆర్ మొదటినుంచి తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా ఆయనకు వ్యతిరేకంగా కరణం రామచంద్రరావు ఉండేవారని... అయినప్పటికీ ఆ సమస్యను సరిచేశామని చెప్పారు. కేసీఆర్ కంటే విజయరామారావు గొప్ప నాయకుడు కానప్పటికీ, పీజేఆర్ ను ఓడించారనే ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. కొన్ని పరిణామాలు ఊహకు కూడా అందకుండా జరిగిపోతాయని చెప్పారు. అయితే, ప్రతిదానికీ ఎదో అయిపోతుందనే భావనలో ఉంటే... ఏదీ చేయలేమని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పురస్కరించుకుని ఓ ప్రత్రికా నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు మనసు విప్పి మాల్టాడారు.