Highlights
- పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు
- మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సినీ నటి శ్రీదేవి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వయించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. మొదట ఈ నిర్ణయమేమీ తీసుకోని ప్రభుత్వం అప్పటికప్పుడు తీసుకుని ప్రభుత్వ ప్రరంగానే ఆమె అంత్యక్రియలు జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆమె మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఇప్పటికే వేలాదిమంది అభిమానులు, వందలాది మంది నటీనటులు ముంబైకి చేరుకుని శ్రీదేవికి సంతాపం తెలిపారు. మరికొంత నటీనటులు ఇప్పుడిప్పుడే ముంబైకి చేరుకుంటున్నారు.