యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
రెండు ఓటములతో ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న సన్‌రైజర్స్ మళ్లీ రేసులోకి వచ్చింది. డేవిడ్ వార్నర్ (81; 56 బంతుల్లో 7×4, 2×6) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సోమవారం సొంతగడ్డపై జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. కేఎల్ రాహుల్ (79; 56 బంతుల్లో 4×4, 5×6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఖలీల్ (3/40), రషీద్‌ఖాన్ (3/21) పంజాబ్‌ను దెబ్బతీశారు. వరుసగా మూడో పరాజయంతో తన ప్లేఆఫ్స్ అవకాశాలను పంజాబ్ సంక్లిష్టం చేసుకుంది.