యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 'ఫణి' తీవ్ర తుపానుగా మారింది. వాయువ్యదిశగా గంటకు 13 కి.మీ వేగంతో తుపాను కదులుతోంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 710 కి.మీ దూరంలో ఫణి తుపాను ప్రయాణిస్తోంది. మచిలీపట్నానికి 810 కి.మీ దూరంలో ఫణి తుఫాన్ కేంద్రీకృతమైంది. 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు అధికారులు భారీ నుంచి అతిభారీ వర్ష సూచన చేశారు.