YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేతల సర్వే... టెన్షన్ లో నేతాశ్రీలు

వైసీపీ నేతల సర్వే... టెన్షన్ లో నేతాశ్రీలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు నుంచి.. పోలింగ్ తరువాత కూడా వైసీపీ చెబుతున్నది ఒక్కటే. 120కి పైగా సీట్లు సాధించి తాము అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. వైసీపీ నేతల విశ్వాసం చూసి ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నేతల్లో విపరీతమైన ఆందోళన ఉండేది. అయితే.. గురువారం నుంచి ఈ పరిస్థితి మారిందని తెలుస్తోంది. దీనికి కారణం... వైసీపీకి చెందిన ఓ కీలక నేత, కోస్తా జిల్లాల్లోని ఓ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఒకరు పోలింగ్ మరునాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేయించిన పోస్ట్ పోల్ సర్వే ఫలితాలు అందడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని తెలుస్తోంది. అయితే.. ఈ ఫలితాలు జగన్ వచ్చాక ఆయన ముందుంచుతారని సమాచారం.. కానీ, ఆలోగానే స్థూలంగా ఆ వివరాలు బయటకు వచ్చాయని.. వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని ఆ సర్వే తేల్చిందని సమాచారం.ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తరువాత 12వ తేదీ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే ప్రారంభమైనట్లు సమాచారం. ఓటింగ్‌లో పాల్గొన్నవారిని కలిసి వారితో మాట్లాడి ఎవరికి ఓటేశారన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 1200 మందితో మాట్లాడి ఈ సర్వే చేశారట. ఈ క్రమంలో వైసీపీ ఊహిస్తున్న స్థాయిలో వారికి ఓట్లు పడలేదని తెలసుకున్నారని సమాచారంప్రధానంగా మహిళల ఓట్లు అత్యధికం టీడీపీకే పడ్డాయని సర్వేలో తేలిందట. నియోజకవర్గాల్లో తీసుకున్న 1200 మంది శాంపిల్‌లో 500కి తగ్గకుండా మహిళలు ఉన్నట్లు చూసుకున్నారట. ఆ క్రమంలో ప్రతి 500 మంది మహిళల్లో 400 మంది టీడీపీకి ఓటేసినట్లు అర్థమైందని చెబుతున్నారు.
ఏపీలో 3.83 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 80 శాతం ఓటేశారు. అంటే... సుమారు 3 కోట్ల మందికిపై ఓటేశారు. అందులో సగానికిపైగా మహిళలే. పోనీ సగం అనుకున్నా.. 1.5 కోట్ల మంది మహిళలు ఓటేసినట్లు. మరోవైపు చంద్రబాబు పసుపు కుంకుమ పథకంలో లబ్ధి పొందిన మహిళల సంఖ్య 94 లక్షలు.. దీనికి కూడా పోలింగ్ శాతం 80 శాతం లెక్కేస్తే.. పసుపు కుంకుమ లబ్ధిదారుల్లో 75 లక్షల మంది ఓటేసినట్లు. అంటే... ఏపీలో ఓటేసిన వారిలో 25 శాతం పసుపు కుంకుమ లబ్ధిదారులే. వీరంతా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. పైగా కులాలు, మతాలు, వయసులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల, వయోవిభాగాల మహిళలు ఇందులో ఉంటారు. 
వైసీపీ చేయించిన సర్వేలోనూ ఇదే విషయం తేలిందట. టీడీపిక ప్రతి నియోజకవర్గంలో 25 శాతం ఓట్లు వీరివి పడ్డాయని.. మిగతా టీడీపీ సంప్రదాయ ఓటింగ్ కలుపుకొని టీడీపీ ఈసారి భారీ విజయం సాధించనుందని ఆ సర్వేలో తేలిందట. టీడీపీకి 95 నుంచి 105 సీట్లు రావొచ్చని తేలిందట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వైసీపీ నాయకుల్లో నీరసం ఆవరించిందని సమాచారం. 

Related Posts