Highlights
ర్యాలీకి మళ్ళీ బ్రేక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో సాగిన కుంభకోణం ముందు అనుకున్నట్లుగా సుమారు రూ. 11,400 కోట్లు కాక, రూ. 1300 కోట్ల మేర ఉండవచ్చని అంచనాకు రావడంతో బ్యాంకింగ్ రంగ షేర్ల ధరలు తీవ్రంగా పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజ్ (బి.ఎస్.ఇ) సున్నిత సూచి ‘సెన్సెక్స్’ సుమారు 100 పాయింట్లు కోల్పోయి 34,346.39 పాయింట్ల వద్ద ముగిసింది. నిజానికి ‘సెన్సెక్స్’ మంగళవారం 34,558.56 పాయింట్ల వద్ద హెచ్చు స్థాయిలోనే ప్రారంభమైంది. తొలి ట్రేడింగ్‌లో 34,610.79 పాయింట్ల గరిష్ఠ స్థితిని కూడా చూసింది. కానీ, వెంటనే తిరోగవునంలో పడి 34,314.87 పాయింట్ల కనిష్ఠ స్థితిని చూసింది. దేశీయ మదుపు సంస్థలు మొక్కవోని విశ్వాసంతో కొనసాగిస్తున్న కొనుగోళ్ళతో ‘సెన్సెక్స్’ గత రెండు సెషన్లలో 626.25 పాయింట్లు పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్.ఎస్.ఇ) సూచి ‘నిఫ్టీ’ స్వల్పంగా 28.30 పాయింట్లు క్షీణించి 10,554.30 పాయింట్ల వద్ద ముగిసింది.