యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయాలు ఎన్నేళ్ల అనుభవం ఉన్నా ఆసక్తికరంగా, టెన్షన్ గానే ఉంటాయి. జీవితంలో అయినా కొన్ని సార్లు మనం అనుకున్నవి జరుగుతాయేమో గాని రాజకీయాల్లో మాత్రం అన్నీ అనూహ్యమైన ఘటనలే జరుగుతుంటాయి. ఉదాహరణకు ఏపీ రాజకీయాలనే తీసుకుందాం. ఇక్కడ 175 సీట్లలో గెలుస్తామని ఏ పార్టీ అనుకోదు. కానీ 175 సీట్లలోనూ అభ్యర్థులను జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది. బహుశా... పులివెందుల, కుప్పం మినహాయింపు కావచ్చు. అంటే మిగతా 174 సీట్లలోనూ చాలా జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తాయి అన్ని పార్టీలు.
మరి ఎవరికి మాత్రం తెలియదు కనీసం 30 సీట్లలో గ్యారంటీగా ఓడిపోతామని? తెలుసు. కానీ... ఏమో చెప్పలేం అనే ధోరణి. కొన్ని లెక్కలు. ఎన్నికల మూడ్... ఇవన్నీ కలిసి ఆశను పుట్టిస్తాయి. అయితే... పోలింగ్ నాటికి అందరికి చాలావరకు క్లారిటీ వస్తుంది. ఏపీలో టీడీపీ గెలిచే 40 నియోజకవర్గాలు, ఓడే 30 నియోజకవర్గాలు కచ్చితంగా చంద్రబాబు చెప్పగలరు. అలాగే జగన్ కూడా తమ పార్టీ గురించి పోలింగ్ సమయానికి అంచనా వేయగలరు. ఇద్దరు టెన్షన్ పడేది టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గాల గురించే. ఇపుడు ఫలితాలకు ఎపుడూ లేనంత గ్యాప్ రావడంతో చంద్రబాబు పోలింగ్ బూత్ లెవెల్లో ప్రతి నియోజకవర్గంపై రిపోర్టులు తెప్పించుకున్నారు. 24 గంటలు ఖాళీ కదా. కాబట్టి పార్టీపై పూర్తిగా దృష్టిపెట్టి.. అసలేం జరిగింది అని ఆరాతీస్తున్నారు. జగన్ గెలుపు నాదే అని ఫిక్సయిన నేపథ్యంలో రివ్యూలు వంటివి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడుతున్న చంద్రబాబు నువ్వు గెలుస్తున్నావు. నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేస్తున్నాడట. చంద్రబాబు వద్ద సమాచారం ఆధారాలు విని తెలుగుదేశం అభ్యర్థులు అవాక్కువుతున్నారట.
ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో 5 గెలుస్తామని... ఆ ఐదు పలాసలో గౌతు శిరీష, పాతపట్నంలో కలమట వెంకటరమణ, ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావు, రాజాంలో కొండ్రు మురళీ మోహన్, టెక్కలి లిలో అచ్చెన్నాయుడు అని కూడా చంద్రబాబు చెప్పడం విశేషం. ఆముదాల వలస, ఇచ్ఛాపురంలలో గట్టి పోటీ ఉందని... అక్కడ ఎవరైనా గెలవొచ్చని బాబు తేల్చారట. అలాగే... నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో టీడీపీ గెలవదని చంద్రబాబు వివరించారట. ఏమిటి ఈ సమాచారం... ఇంటెలిజెన్స్ కంటే బాబు నెట్ వర్కే బలంగా ఉందని అభ్యర్థులు చర్చించుకుంటున్నారని చెబుతున్నారు.ఇలాగే ప్రతి జిల్లాలో బాబు క్షణ్ణంగా ఆరా తీస్తున్నాడని తెలుస్తోంది. ఆల్మోస్ట్ గెలుపు వైపు ఉన్నామని భరోసా ఉన్నా... టఫ్ ఫైట్ ఉన్న సీట్ల గురించి కొంచెం బెంగ ఉందని చెబుతున్నారు. మరి ఫలితాలు ఈవీఎంలలో ఏం నిక్షిప్తం అయిఉన్నాయో దేవుడికి తప్ప ఎవ్వరికి తెలిసే అవకాశం లేదు. తేడా జరిగి ఉంటే... మోడీకి ఎన్నికల సంఘానికి తెలిసి ఉండాలి.