యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
తన కెరీర్ ఆరంభంలో కొన్ని పొరపాట్లు చేశానని అంటోంది అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్. 'అప్పట్లో నాకు ఏమీ తెలియదు, గైడ్ చేసే వాళ్లు కూడా లేరు, దాంతో కెరీర్ పరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. దానివల్ల కొంత నష్టపోయాను. అయితే, ఆ తప్పుల కారణంగా ఎంతో నేర్చుకున్నాను. తర్వాతి కాలంలో ఎలా ఉండాలో తెలుసుకున్నాను' అని చెప్పింది రకుల్.