Highlights
- ఈ శని, ఆదివారాల్లో పరిశీలనకు
- మధ్యంతర ఆదేశాలు జారీ
- ముగ్గురు న్యాయవాదులను నియమించాలని రిజిస్ట్రార్ కి సూచన
- మధ్యంతర ఆదేశాలు జారీ
- మార్చి19వ తేదీకి విచారణ వాయిదా
- ఉమ్మడి హైకోర్టు నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-2 ఉద్యోగ నియామక పరీక్షపత్రాలను పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు నిర్ణయించింది.ఇందుకోసం ముగ్గురు న్యాయవాదులను నియమించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ న్యాయవాదులు దిద్దినట్లు ఉన్న జవాబులకు సంబంధించి వైట్ నర్ వినియోగించిన ఓఎంఆర్ జవాబు పత్రాలను పరిశీలించనున్నారు. ఈ శని, ఆదివారాల్లో ఈ ఓఎంఆర్ జవాబు పత్రాలను పరిశీలించాలని, మూడు వారాల్లో పరిశీలన నివేదికను తమ ముందుంచాలని సూచించింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.