కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ప్రవేశానికై దేశ వ్యాప్తంగా నిర్వహించిన కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజా హరీన్, ఉప కులపతి డాక్టర్ ఎల్ ఎస్ ఎస్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా హరీన్ మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చే లక్ష్యంతో నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షలో విజయవాడ ఛైతన్య జూనియర్ కళాశాలకు చెందిన పి. రాహుల్ కృష్ణ మొదటి ర్యాంక్ ను సాధించాడని, హైదరాబాద్ విజయ రత్న కళాశాలకు చెందిన ఎమ్. తేజేష్ రెండవ ర్యాంకును, విజయవాడ శ్రీ చైతన్య ఐ ఐ టి అకాడమీ కి చెందిన టి. ప్రదీప్ రెడ్డి 3 వ ర్యాంకు ను పొందినట్లు ఆయన ప్రకటించారు. జాతీయ స్థాయిలో 20 లోపు ర్యాంకులు పొందిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ కింద 25 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు రాజా హరీన్ వెల్లడించారు.
కే ఎల్ యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఎల్ ఎస్ ఎస్ రెడ్డి మాట్లాడుతూ కేఎల్ఈఈఈ ర్యాంకర్లతో పాటు, ఎంసెట్ , జే ఇ ఇ లలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు, ఇంటర్ మీడియట్ లో 9 సి జీ పి ఏ కన్నా ఎక్కువ జి పి ఏ వచ్చిన విద్యార్థులకు ఈ నెల 9 వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా 9 వ తేదీ ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ, ఎన్సీసీ, క్రీడలు వంటి విభాగాలలో రిజర్వేషన్ కేటగిరి కింద కేఎల్ఈఈఈ, ఎంసెట్చ జేఈఈసీబీఎస్ఈ, ఇంటర్ మీడియట్ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, 10 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి కేఎల్ఈఈఈ లో 1 నుంచి 4 వేల లోపు ర్యాంకులు పొందిన విద్యార్థులకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4001 నుంచి 7 వేల లోపు ర్యాంకులు పొందిన విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు.
11 వ తేదీ కేఎల్ఈఈఈ లో 7001 ర్యాంక్ నుంచి 13 వేల లోపు ర్యాంకులు పొందిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.
12 వ తేదీ ఓపెన్ విభాగం కింద ఎంసెట్, జేఈఈ, సబీఎస్ఈ , ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగుతుందని, 13, 14 తేదీలలో కేఎల్ఈఈఈ లో 13 వేల నుంచి 30 వేల లోపు ర్యాంకులు పొందిన విద్యార్థులకు అలాగే కేఎల్ఈఈఈ,ఎంసెట్ లో అర్హులైన బై.పి.సీ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కేఎల్ఈఈఈ పరీక్ష ఫలితాలను, కౌన్సిలింగ్ వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఏర్పాటు చేశామని ఎల్ ఎస్ ఎస్ రెడ్డి చెప్పారు. యూనివర్సిటీ డీన్ డాక్టర్ కే.రామకృష్ణ , ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వెంకట్రామ్, అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే. శ్రీనివాసరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.