కార్మికులకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటుంది. కార్మికుల కోసం ఉచితంగా సొంతింటి నిర్మాణం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం జిరగిన మే డే వేడుకల్లో అయన పాల్గోన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులను సన్మానించారు. చంద్రబాబు మాట్లాడుతూ కార్మిక హక్కులను కాపాడుకోవడంతో పాటు ఆధునికీకరించాల్సి ఉందన్నారు. కార్మికుల కష్ట ఫలితమే రాష్ట్ర సంపద అని అన్నారు. కార్మికులకు ఎల్లప్పుడూ తెదేపా అండగా ఉంటోందని చంద్రబాబు చెప్పారు. కార్మికులను దోపిడీ చేస్తే ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని విమర్శించారు. ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. చంద్రన్న బీమా ద్వారా కార్మికులకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని, త్వరలోనే ఈ మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచుతామన్నారు. డ్రైవర్ల సాధికార సంస్థను ఏర్పాటు చేసి ఆదుకుంటున్నామని గుర్తుచేశారు. అసంఘటిత కార్మికుల కోసం ఉచితంగా సొంతింటి నిర్మాణం చేపడతామని, ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తనదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సంపద సృష్టించడంలోనూ, సంపదను పేదలకు వినియోగించడంలోనూ ముందుంటామని చెప్పారు.