నాలుగు దశల్లో 372 పార్లమెంట్ స్థానాలకు 19 రాష్ట్రాలలు, 5 కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల్లో ముగిశాయి. ఏపీ తరహాలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు మొరాయించాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ బెంగాలో మరీ ఘోరంగా ఈవీఎంలు మొరాయించాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రముఖమైన అభ్యర్థులు విషయంలో ఒకరికి ఓటు వేస్తే..వేరే వారికి ఓటు పడింది. ఈవీఎంలు పై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చెప్తున్నాము వెయ్యిశాతం టీడీపీ గెలవబోతుతోంది. వీవీపాట్ లు టీడీపీ పోరాటం కారణంగానే వచ్చాయని అయన అన్నారు. ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని గతంలోనే ప్రూవ్ చేసారు. చాలా దేశాలు పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నాయి వీవీపాట్ స్లిప్స్ 50 శాతం లెక్కించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీవీపాట్ లు 7 సెకండ్స్ కనిపిస్తాయని చెప్పారు...3 సెకండ్స్ మాత్రమే కనిపిస్తున్నాయని వీడియో లు కూడా ఇచ్చామని అన్నారు. ఎన్నికల సంఘం తమ పారదర్శకతను కోల్పోతుంది. సమీక్షల మీద లెటర్ రాస్తే కేంద్ర ఎన్నికల సంఘం కనీసం స్పందించలేదు. ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ముఖ్యమంత్రులు అందరూ ఎన్నికల సంఘనాన్ని అడుక్కునే పరిస్థితి లో ఉన్నారాఅని అయన ప్రశ్నించరు. ప్రధానికి కోడ్ వర్తించదా? ఎన్నికల సంఘం దీని పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.