Highlights
- మార్చి1న జిల్లా కేంద్రాల్లో ధర్నాకు వైయస్సార్‌సీపీ పిలుపు.
- సంకల్ప యాత్రకు విరామం
- మార్చి 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా
- పాదయాత్ర శిబిరం నుంచి జగన్ పర్యవేక్షణ
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇవ్వాలన్న డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి 1 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టేందుకు సమర్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నాలు నిర్వహించాలని బుధవారం ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా మార్చి 1న ప్రజా సంకల్పయత్రకు విరామము. కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
పాదయాత్ర శిబిరం నుంచి పార్టీ ధర్న కార్యక్రమాలను వైయస్ జగన్. పర్యవేక్షించనున్నారని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. జగన్ చేపట్టిన సంకల్ప యాత్ర మార్చి 2 వ తేదీ నుంచి తిరిగి కొనసాగుతుందని చెప్పారు. కాగా మార్చి 5న జంతర్ మంతర్ వేదికగా ప్రత్యేక హోదాకోసం ధర్నా చేపట్టనున్న అయన తెలిపారు.
ఏపీ లకు జగన్ దిశానిర్దేశం ..
ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు వద్ద మార్చి 3న ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు.ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు వద్ద అయన వాహణశ్రేణికి జెండా ఊపనున్నారని తలశిల పేర్కొన్నారు.