YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

సోషల్ మీడియాను కుదిపేస్తున్న డ్రస్సుల కామెంట్స్

 సోషల్ మీడియాను కుదిపేస్తున్న డ్రస్సుల కామెంట్స్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
 

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన ఆడవాళ్ల కట్టు,బొట్టు ఇతర దేశాలు, విదేశాలకు ఆదర్శమని చెప్పడంలో సందేహమే లేదు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. కొందరు అమ్మాయిలు ఫారెన్ కల్చర్ పేరుతో వస్త్రధారణనే మార్చేశారు. పొట్టి, పొట్టి బట్టలతో రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అమ్మాయిలు ధరించే వస్త్రధారణ, పొట్టి పొట్టి డ్రస్సులు కూడా ఈ అత్యాచారాలకు దారితీస్తున్నాయనేది కొందరి వాదన. ఇలా కొందరు రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా నోరి జారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి వివాదమొకటి ఢిల్లీలో తెరపైకి వచ్చింది.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఢిల్లీలో ఓ మధ్యవయస్కురాలైన మహిళ.. పొట్టి బట్టలేసుకునే అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. నగరంలోని ఓ రెస్టారెంట్‌కు సదరు మహిళ వెళ్లింది.. అక్కడ పొట్టి పొట్టి డ్రస్సులతో ఇద్దరు అమ్మాయిలు కనిపించారట. ఇలాంటి డ్రస్సులు వేసుకుంటే.. అబ్బాయిలు రేప్ చేయకుండా.. ఏం చేస్తారు అనేసింది. ఆ వ్యాఖ్యలతో షాక్ తిన్న అమ్మాయిలు.. మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆమె అక్కడితో ఆగలేదు.. అక్కడే కూర్చొన్న యువకుల దగ్గరకు వెళ్లి పొట్టి డ్రస్సులు వేసుకునే అమ్మాయిలను రేప్ చేయండి అంటూ గట్టిగా అరిచి చెప్పిందట. సీన్ కట్ చేస్తే ఆ మహిళ రెస్టారెంట్ నుంచి ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లింది. ఆ ఇద్దరమ్మాయిలు ఆమెను వెంబడించారు.. క్షమాపణలు చెప్పాలంటూ హెచ్చరించారు. ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు.. క్షమాపణ చెప్పేందుకు ససేమీరా అనేసింది. అమ్మాయిలూ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.. సారీ చెప్పాల్సిందేనన్నారు. ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా యువతులు వదల్లేదు. దీంతో సదరు మహిళ పోలీసుల్ని పిలవండి.. క్షమాపణలు చెప్పేది లేదంటూ పెద్దగా కేకలు వేసింది. రెస్టారెంట్ దగ్గర నుంచి షాపింగ్ మాల్ వరకు మహిళను వెంబడించిన ఇద్దరు యువతులు మొబైల్‌లో వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8లక్షలమందికిపైగా చూస్తే.. ఫేస్‌బుక్‌లో దాదాపు 70వేలమంది చూశారు. ఏకంగా 17వేల షేర్లు వచ్చాయి

Related Posts