YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉగ్రవాదాన్ని వదిలేసిన మరో యువకుడు

ఉగ్రవాదాన్ని వదిలేసిన మరో యువకుడు

కశ్మీర్‌లో మరో యువకుడు ఉగ్రవాదాన్ని వీడి ఇంటికి తిరిగొచ్చాడు. నెల రోజుల కిందట హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరిన దక్షిణ కశ్మీర్ యువకుడు హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరినట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ట్విట్టర్‌లో ఈ విషయం తెలియజేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు, అతడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉగ్రవాదం నుంచి బయటకు వచ్చింది ఎవరనే విషయం బయటకు తెలిస్తే అతడి ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు తెలిపారు. ‘కుటుంబసభ్యులు, పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.. మరో యువకుడు ఉగ్రవాదం వీడి ఇంటికి తిరిగొచ్చాడు.. భద్రతా కారణాలతో అతడి వివరాలను వెల్లడించలేం’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే, అగిర్చక్ పుల్వామాకు చెందిన ఆ యువకుడు ఇంటర్ పూర్తిచేసినట్టు తెలుస్తోంది. గత మార్చిలోనే హిజ్బుల్ ముజాయిద్దీన్ సంస్థలో చేరినట్టు సమాచారం. గతేడాది మార్చిలో ఓ మాతృమూర్తి విన్నపాన్ని మన్నించిన కొడుకు ఉగ్రవాదం వీడి పోలీసులకు లొంగిపోయాడు. కుమారుడ్ని తన చెంతకు చేర్చాలని ఆ తల్లి మీడియా ముందుకు వచ్చి అర్ధించింది. తల్లి ఆవేదనను అర్థం చేసుకున్న ఆ యువకుడు అమ్మ కోసం తాను ఉగ్రకార్యకలాపాలు శాశ్వతంగా విడిచిపెడుతున్నట్లు ప్రమాణం చేశాడు. ఇలా ఉగ్రవాదాన్ని వీడి తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు ఎందరో ముందుకు వస్తున్నారని, ఇది శుభపరిణామమని జమ్మూ కశ్మీర్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంలో చేరిన యువకులను తిరిగి వెనక్కు రప్పించే కార్యక్రమానికి 2004లో శ్రీకారం చుట్టి దీనికి 2010లో కొన్ని మార్పులు చేశారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో 600 మంది యువకులు ఇలా తిరిగొచ్చారు. ఇందు కోసం రూ.10 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేసింది. 

Related Posts