జస్టిస్ సుభాషణ్‌రెడ్డి మృతిపట్ల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పార్థివ దేహానికి సందర్శించి నివాళులర్పించారు. సుభాషణ్‌రెడ్డి మృతి పట్ల ఏపి ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు. ఆయన మృతి న్యాయ రంగానికి తీరని లోటని చంద్రబాబు అభివర్ణించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. అనారోగ్యంతో కన్నుమూసిన జస్టిస్ సుభాషణ్‌రెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఆయన స్వగృహానికి చేరుకుని భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సుభాషణ్‌రెడ్డి మృతిపట్ల తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు నివాళులర్పించి సంతాపం ప్రకటించారు.అనారోగ్యంతో మరణించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. బషీర్‌బాగ్‌లోని అవంతినగర్‌లో జస్టిస్ సుభాషణ్ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.