YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

ఉల్లి దిగుమతి తగ్గడంతో కిలో 15

 ఉల్లి దిగుమతి తగ్గడంతో కిలో 15
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కొన్ని నెలలుగా వినియోగదారులను కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు బుధవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. హోల్‌సేల్‌గా కిలో రూ.3, రిటైల్‌గా రూ.7 పలికాయి. ఈ ఏడాది ఇదే కనిష్ట ధర అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఉల్లి పంట నగరంలోని మలక్‌పేట్‌ మార్కెట్‌కు భారీగా దిగుమతి కావడంతో తక్కువ ధర పలికింది. తాండూరు, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డితో పాటు కర్ణా టక, మహారాష్ట్ర ల నుంచి ఎక్కువ మొత్తంలో కొత్త ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మలక్‌పేట్‌ మార్కెట్‌కు నిత్యం దాదాపు వెయ్యి టన్నుల ఉల్లి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం మలక్‌పేట్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌కు తెలుగు రాష్ట్రాల్లోని మెదక్, తాండూరు, మహబూబ్‌నగర్, కర్నూలు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలనుంచి ఉల్లి దిగుమతులు పెరిగాయి. దీంతో హోల్‌సేల్‌గా కిలో ఉల్లి రూ.3కు చేరింది. వారం పది రోజుల క్రితం హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటా లు ఉల్లి రూ.800–1000 వరకు ఉండేది. దీం తో రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.15– 20 పలి కింది. ప్రస్తుతం కొత్త పంట వస్తుండడంతో ధరలు భారీగా తగ్గాయి. ఫస్టు క్వాలిటీ ఉల్లి కిలోకు రూ.7 ఉండగా, మధ్య రకం క్వాలిటీ రూ.5గా ఉంది. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో ఒకే సారి సాధారణ ఉల్లి ధరలు పడిపోయాయి.  

Related Posts