YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బహరేన్ లో రాహుల్ గాంధీకి గల్ఫ్ సమస్యలను వివరించిన నంగి దేవేందర్ రెడ్డి

బహరేన్ లో రాహుల్ గాంధీకి గల్ఫ్ సమస్యలను వివరించిన నంగి దేవేందర్ రెడ్డి

'గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్' (గోపియో) సంస్థ ఈనెల 6 నుండి 8 వరకు బహరేన్ లో ప్రవాసీ సమ్మేళన్ నిర్వహించింది. సమావేశం చివరిరోజైన శనివారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్, టెలికం నిపుణుడు శ్యామ్‌ పిట్రోడా తదితర బృందంతోపాటు రాహుల్ గాంధీ బహరేన్ యువరాజు, ఆర్ధిక మంత్రి తదితర ప్రముఖులతో భేటీ అయ్యారు. 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గల్ఫ్ ఎన్నారై విభాగం అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి సభాస్థలివద్ద రాహుల్ గాంధీని కలిసి 10 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తెలంగాణ గల్ఫ్ వలసలపై ఒక నివేదికను అందజేశారు. గల్ఫ్ దేశాల సహకారమండలి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్-జిసిసి) లోని ఆరు దేశాలలో ప్రవాస భారతీయుల జనాభా 87.64 లక్షలు ఉన్నదని వీరందరూ ఎన్నారై ఓటర్లుగా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడానికి ఇండియన్ ఓవర్సేస్ కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలనే ప్రస్తావన వచ్చిందని దేవేందర్ రెడ్డి తెలిపారు. 

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ  తన ఎలక్షన్ మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) పేజీ నెం.22లో 'ప్రవాసుల సంక్షేమం' పేరిట ఇచ్చిన హామీలు సాధించడానికి, గల్ఫ్ లో మృతి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) ఇప్పించడానికి, కేరళ తరహాలో జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన పథకం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని దేవేందర్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించారు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చినంక పునరావాసం, పునరేకీకరణ కొరకు,  గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్నతెలంగాణ ప్రవాసీలకు న్యాయ సహాయం, రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిఏటా రూ.100 కోట్లు గల్ఫ్ ప్రవాసీల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించదానికి, సమగ్ర ఎన్నారై పాలసీ కోసం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం పోరాటం చేస్తుందని వివరించారు. 

Related Posts