YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఇక సెలవు ఓ నా  ప్రియ నేస్తమా.. 

Highlights

భావోద్వేగానికి లోనైన హేమమాలిని 

ఇక సెలవు ఓ నా  ప్రియ నేస్తమా.. 

హఠాన్మరణం చెందిన శ్రీదేవి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలీవుడ్‌ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలి దాదాపు కంటతడి పెట్టుకున్నారు. ఒక దశలో భావోద్వేగానికి లోనయ్యారు.  'మరణంలోనూ నిర్మలంగా ఎరుపు చీరలో చాలా అందంగా కనిపిస్తూ శ్రీదేవి పవళిస్తోంది' అంటూ హేమ భావోద్వేగంతో నిండిన ట్వీట్‌ చేశారు. శ్రీదేవి  అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కడసారి ఆమెను చూసేందుకు హేమమాలిని వచ్చారు. 'నా నివాళులు అర్పించాను. మొత్తం చిత్ర పరిశ్రమ అక్కడే శోకసంద్రంలో మునిగిపోయి ఉంది. అది ఆమెకు ఉన్న తేజస్సు.. ఆమె నటించిన చిత్రాల మ్యాజిక్‌.. ఎర్రచీరలో ఆమె చాలా అందంగా కనిపిస్తూ అక్కడ ప్రశాంతంగా పవళిస్తోంది. ఏర్పాట్లు అన్నీ చాలా బాగా చేశారు. గుడ్‌బై మై డియర్‌ ఫ్రెండ్‌' అని హేమమాలిని ట్వీట్‌ చేశారు. 

Related Posts