యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖపట్నం కు 270 కిలో మీటర్లు, మచిలీపట్నం కు 350 కిలో మీటర్ల దూరంలో ఫోని తుఫాన్ కేంద్రీకృతమైంది. అంచనామేరకు ఓడిశా వైపు వేగంగా కదులుతున్నది. శ్రీకాకుళం ఉత్తర, తీరప్రాంత మండలాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గురువారం, శుక్రవారం రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం తీరప్రాంత మండలాల్లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతాల్లో పెనుగాలలు వీస్తాయి. విజయనగరం తీరప్రాంత మండలాల్లో గంటకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. గురువారం అర్థరాత్రి నుంచి మరుసటిరోజు తెల్లవారుజాము వరకు వరకు తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఉత్తర శ్రీకాకుళం, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈరోజు మరియు రేపు అతి భారీ వర్షాలు కురిసే సూచనలు వున్నాయి. విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయి. తీవ్ర ప్రభావమున్న మండలాలు
శ్రీకాకుళం జిల్లా గార, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా లోని భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగమండలాలు.