YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కథానాయికల కాల పరిమితి ఎంత..

కథానాయికల కాల పరిమితి ఎంత..

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోలు దశాబ్దాలు కొద్దీ హీరోలుగానే ఉంటారు కానీ హీరోయిన్ లు కాల పరిమితి మాత్రం మూడు నుంచి నాలుగు ఏళ్ళు మాత్రమే. తరువాత వాళ్ళు హీరోల అక్కలుగానో, అమ్మలుగానో, వదినలుగానో చేసుకోవాల్సిన పరిస్థితి.. ఇటువంటి పరిస్థితి ఒక మన ఇండస్ట్రీలో మాత్రమే ఉంటుంది.. మన పొరుగు ఇండస్ట్రీ అయినా బాలీవుడ్లో మాత్రం కథను బట్టి.. కారెక్టర్ ను బట్టి కథానాయికలు ఎంపిక జరుగుతుంది. ఐశ్వర్య రాయి, దీపికా పదుకొనె, విద్య బాలన్ వంటి కథానాయకులు ఇప్పుడు కూడా కొత్త హీరోలతో, కుర్ర హీరోలతో, స్టార్ హీరోలతో కూడా నటిస్తున్నారు..
             ప్రస్తుతం మిల్కీ బ్యూటీ  తమన్నా విషయానికి వస్తే..  తమన్నా శేఖర్ కమ్ముల తీసిన 'హ్యాపీ డేస్' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమై టాలీవుడ్ ని తన నటనతో, డాన్సులతో  ఒక ఊపు ఊపింది. తెలుగు అగ్ర కథానాయకులు అందరితో పని చేసి.. బన్నీ, తారక్, చరణ్ వంటి హీరోలకి లక్కీ గర్ల్ గా మారింది.. ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందిన 'బాహుబలి' సిరీస్ లో  ప్రధాన పాత్ర పోషించింది.. కానీ బాహుబలి చిత్రం తరువాత ఆమె ఒక పెద్ద సినిమా కూడా చేయకపోవడం విశేషం.. సందీప్ కిషన్ వంటి కుర్ర హీరోలతో, మార్కెట్ లేని హీరోల చిత్రాలలో ఆమె నటిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో నటిస్తుంది తప్ప స్టార్ హీరో సరసన ఆమె సినిమా చేసి దాదాపు మూడు  ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ చిత్రం 'క్వీన్' తెలుగు  రీమేక్ మరియు చిరంజీవి.. సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న 'సైరా' చిత్రాలు ఉన్నాయి..
               మన టాలీవుడ్ లో మూడు సంవత్సరాలకి ఒక్కసారి కథానాయికల గుంపు మారుతుంది.. పాలనా సినిమాలో  కొత్త అమ్మాయి ని పెట్టి హిట్ కొడితే ఆమె మార్కెట్ బావుంది మన చిత్రంలో కూడా తననే పెట్టుకుందాం అనే ఆలోచనలలో హీరో, దర్శక.. నిర్మాతలు ఉంటున్నారు. ఒక తమన్నా విషయంలోనే కాదు సమంత, కాజల్, నిత్య మీనన్,అనుష్క వంటి అద్భుతమైన కథానాయకులకు అవకాశాలు లేక పక్క ఇండస్ట్రీ కి వలసలు పోతున్నారు, లేకపోతే నటనకు ఆస్కారం లేని పాత్రలలో నటిస్తున్నారు. కాబట్టి మన దర్శక.. నిర్మాతలు మేల్కొని మార్కెట్ పరంగా కాకుండా నటన, అభినయం పరంగా హీరోయిన్లను ఎంపిక చేసుకోవాలని ప్రతి సినీ ప్రేమికుడి కోరిక

Related Posts