వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ లపై ఇక నుంచి ‘ఫార్వర్డెడ్ మెసేజ్’ అని దానిపై టాగ్ కనిపించనుంది. భారీ స్థాయిలో మార్పిడి జరిగే స్పాం నిరోధానికి వాట్సాప్ చర్యలకు ఉపక్రమించింది.వాట్సాప్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వీ2.18.67లో మాత్రమే ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు పర్కొంది. ఇక, దాంతో పాటుగా విండోస్ ఫోన్ బీటా వెర్షన్‌లో స్టిక్కర్లను పొందుపరిచిన వాట్సాప్.. ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ ఆ ఫీచర్లను పొందుపరిచింది. ఫార్వర్డెడ్ మెసేజెస్, స్టిక్కర్లతో పోలిస్తే.. గ్రూప్ డిస్క్రిప్షన్ ఫీచర్ వినియోగదారులందరికీ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులెవరైనా సరే గ్రూప్ డిస్క్రిప్షన్‌ను ఎడిట్ చేసే వెసులుబాటును కల్పించింది వాట్సాప్.