YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తీరం దాటిన ఫణి

 తీరం దాటిన ఫణి
శుక్రవారం ఉదయం ఫణి తుపాను ఒడిశాలోని పూరి దగ్గర తీరం దాటింది. పూరికి దక్షిణంగా ఫణి తుపాను తీరాన్ని దాటింది. తుపాను క్రమంగా బలహీనపడింది.  పూరిలో కుండపోతగా వర్షం కురిసింది. గంటకు . 200-240 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. 
 తుపాన్ కారణంగా పూరీకి సమీపంలో 200 నుంచి 240 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. వేలాది వృక్షాలు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రహదారులపై విరిగిపడ్డ వృక్షాలను తొలగిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు 11 లక్షల మందికిపైగా తరలించారు. నాలుగు వేలకు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసినందున నదులు, వాగులకు వరద ప్రమాదం ఉందని, పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు హెచ్చరించారు. ఇచ్ఛాపురంలో 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, మూడు గుడిసెలు, పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలినట్లు సమాచారం అందిందని చెప్పారు.

Related Posts