YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కొత్త దర్శకులు వరమా.... శాపమా..!!

కొత్త దర్శకులు వరమా.... శాపమా..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో చాలా మంది దర్శకులు ఉన్నారు. దాసరి నారాయణరావు, కే. రాఘవేంద్రరావు, రవి రాజా పినిశెట్టి, కోదండరామి రెడ్డి  అగ్ర హీరోలతో  చాలా చిత్రాలు చేసారు. తరువాత తరంలో శ్రీను వైట్ల, వినాయక్, పూరి జగన్నాధ్, కృష్ణ వంశి కూడా ఎన్నో మంచి చిత్రాలు అదించారు.  వీళ్ళ చిత్రాల ద్వారా ఎంతో మంది కొత్త నటులను, మంచి నటులను మన చిత్ర సీమ కి అదించారు. ప్రస్తుతం ఈ దర్శకుల హవా తగింది. కొత్త కొత్త దర్శకులు కొత్త కొత్త కథలతో వచ్చి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. మన దర్శకులు కూడా రియాలిటీ కి దగ్గరగా ఉండే చిత్రాలు చేస్తున్నారు. తాజాగా క్రికెట్ నేపథ్యంలో వచ్చిన 'జెర్సీ' చిత్రం వచ్చి ప్రేక్షకుల చేత మెప్పు పొందింది.
    కానీ ఈ కొత్త దర్శకులతో ఒక చిక్కు వచ్చి పడింది. కొత్త దర్శకులతో చిత్రాలు చేయడానికి నిర్మాతలు త్వరగా ముందుకి రారు.. ఒక వేళా వచ్చిన దానికి అంత ఖర్చు ఎందుకు, దీనికి ఇంత ఖర్చు అందుకు అని దర్శకులను వెనక్కి లాగేస్తారు కనుక కొత్త దర్శకులు భయపడి కొని పాత్రలు  అనుభవం లేని వాళ్ళతో చేయించి చేతులు కాల్చుకుంటున్నారు. దీని వల్ల ఆ పాత్ర పండట్లేదు . కాబట్టి నూతన దర్శకులు. నిర్మాతలు ఆ సంగతి గ్రహించి నటన పట్ల అనుభవం ఉన్న నటులను తీసుకుని మంచి మంచి కథలను.. మంచి పాత్రలను రాయాలని ప్రతి వీక్షకుడి కోరిక..

Related Posts