యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 289వ జయంతి ఉత్సవాలు మే 16, 17వ తేదీల్లో వైభవంగా జరుగనున్నాయి. వెంగమాంబ స్వస్థలమైన తరిగొండ, తిరుమల, తిరుపతి దివ్యక్షేత్రాలలో జయంతి ఉత్సవాలను వైభవంగా
తరిగొండలో..
తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మే 16వ తేదీ ఉదయం 9.00 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, ఉదయం 10.00 గంటలకు ఆలయ ప్రాంగణంలోని తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం, రాత్రి 7.30 గంటల నుండి భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా మే 17వ తేదీ సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు హరికథ, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తిరుపతిలో..
మే 16వ తేదీ ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు హరికథ, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్దగల వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సు జరుగనుంది. ఇందులో ప్రముఖ పండితులు పాల్గొని వెంగమాంబ రచనలపై ఉపన్యసిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు నృత్య కార్యక్రమం నిర్వహించనున్నారు.