యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కానీ చైనా దేశం మాత్రం ముస్లింలకు రంజాన్ మాసంలో షాకిచ్చింది. చైనా దేశంలో రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉండరాదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆదేశంలోని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముస్లింలంతా రంజాన్ మాసాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. కఠిన ఉపవాసం దీక్షలు ప్రార్థనలతో ఆధ్యాత్మికంగా గడుపుతారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న ముస్లిం అయినా సరే దీక్షలు చేపడుతుంటారు. రంజాన్ మాసంలో ఆదేశంలోని ముస్లింలకు చైనా ఆంక్షలు పెట్టడం వివాదాస్పదంగా మారింది. చైనా లో ముస్లింలు అత్యధికంగా క్సింజియాంగ్ ప్రాంతంలో నివసిస్తుంటారు. అక్కడ ముస్లిం ప్రభుత్వ అధికారులు విద్యార్థులు టీచర్లు దీక్ష చేస్తారు. ఇప్పుడు వారిపై చైనా ప్రభుత్వం దీక్ష చేయవద్దని నిషేధం విధిస్తూ ఆదేశాలిచ్చింది. అంతేకాదు హోటళ్లు రెస్టారెంట్లు యథావిధిగా పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే అన్ని దేశాల్లోనూ ఈ మాసంలో ముస్లింల కోసం ప్రత్యేక ఏర్పాట్లను ప్రభుత్వాలు చేస్తుంటాయి. చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. వారు నాస్తికులు. దేవుళ్లను నమ్మరు. అందుకే ఇలాంటి చర్యకు ఉపక్రమించారు.చైనా ప్రభుత్వం నిషేధంతో మత ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని ఉయిఘర్ మైనార్టీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఘర్షణల్లో వందమంది ప్రాణాలు కోల్పోయారని.. చైనాలోని కమ్యూనిస్టు నాస్తిక నేతల మత చాందసవాదం వల్ల మరోసారి ఉగ్రవాద ముప్పు పెరిగిపోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఇలా ఆదేశాలు జారీచేయడానికి కారణముంది. ముస్లింల మత విశ్వాసం క్సింజియాంగ్ ప్రాంతంలో మితిమీరిపోయింది. అక్కడ హింస కు దారితీస్తోంది. అందుకే ఉపవాస దీక్షలపై నిషేధం విధించామని చైనా అధికారప్రతినిధి తెలిపారు. స్కూలు విద్యార్థులపై కూడా ఈ ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డు లేకుండా మసీదులోకి ఎవరిని అనుమతించవద్దని ముస్లిం మతపెద్దలకు స్పష్టం చేశారు. ఇప్పుడు చైనా ఇచ్చిన ఆదేశాలు ఆ దేశంలోని ముస్లింలను ఇతర దేశాల్లోని ముస్లింలకు కూడా ఆగ్రహం తెప్పించాయి.