యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఎలక్షన్ కోడ్‌ను ఎత్తివేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటూ తూర్పు గోదావరి జిల్లాకు ఎన్నికల కోడ్‌ను మినహాయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హర్షం వ్యక్తం చేశారు. కోడ్ మినహాయింపు ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే వివరాలు ఈసీ క్లారిటీ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో.. అలాగే సహాయ చర్యలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆయన లేఖకు సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను మినహాయించింది